నవతెలంగాణ – కంఠేశ్వర్
స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను మారం యశ్వంత్ రెడ్డి, మల్లేశ్వరి వివాహ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురాబత్తుని శ్రీనివాసరావు డిస్ట్రిక్ట్ చైర్మన్ ఐ క్యాంప్స్, పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలను దివ్యాంగుల కొరకు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఈరోజు లయన్స్ క్లబ్ సభ్యులైన మారం ఆదినారాయణ రెడ్డి పుట్టినరోజు వేడుకలను దివ్యాంగుల మధ్యలో నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది అన్నారు. స్నేహ సొసైటీ కార్యదర్శి, ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ కార్యదర్శి కుమ్మరి పోశెట్టి, దివ్యాంగ బాలలు, సిబ్బంది పాల్గొన్నారు.
స్నేహ సొసైటీలో జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



