ధవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బైసన్’. నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో తెరకెక్కింది. దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని ఈనెల 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బాలాజీ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ధవ్ తనదైన పర్ఫామెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాం. నాకు తెలుగులో విడుదల చేసే అవకాశాన్నిచ్చిన నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలకు ధన్యవాదాలు’ అని అన్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు.
నివాస్ కే ప్రసన్న కంపోజ్ చేసిన ఈ పాటకు దర్శకుడు మారి సెల్వరాజ్ తమిళంలో లిరిక్స్ రాయగా, ఎనమంద్రా రామకృష్ణ తెలుగు లిరిక్స్ అందించారు. మనువర్ధన్ పాట పాడారు. ‘తీరేనా తీరేనా.. గుండెల్లోన మండుతున్న మూగవేదన..’ అంటూ సాగే ఈ పాట సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఇందులో ధవ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు : మారి సెల్వరాజ్, నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్, తెలుగు రైట్స్ : జగదాంబే ఫిలిమ్స్ (నిర్మాత బాలాజీ), మ్యూజిక్ డైరెక్టర్ : నివాస్ కే ప్రసన్న, సినిమాటోగ్రాఫర్ : ఏజిల్ అరసు కే, ఎడిటర్ : శక్తి తిరు, ఆర్ట్ డైరెక్టర్ : కుమార్ గంగప్పన్, ఫైట్ మాస్టర్ : దిలీప్ సుబ్రయన్, కో ప్రొడ్యూసర్స్ : సునీల్, ప్రమోద్, ప్రసూన్, మనింద బేడి.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘బైసన్’
- Advertisement -
- Advertisement -