Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బోథ్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో చేరిన నాయకులను టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారిలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికార ప్రతినిధి చిలుకూరి భూమయ్య, మాజీ ఎంపీపీ ఆత్రం నాగోరావు తదితరులున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలు నచ్చి చేరినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణు గోపాలచారి, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -