Sunday, February 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిన బీజేపీ

అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిన బీజేపీ

- Advertisement -

దిగుమతులతో రైతుల పరిస్థితి దయనీయం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
కేంద్రప్రభుత్వ విధానాలపై ఆందోళనలు
అమెరికా సామ్రాజ్యవాదానికి తలొగ్గిన బీజేపీ
నవతెలంగాణ-మునగాల

అమెరికా సామ్రాజ్యవాదానికి బీజేపీి ప్రభుత్వం తలొగ్గి పనిచేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. శనివారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం జగన్నాధపురంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అధ్యక్షతన అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. సభకు హాజరైన జాన్‌వెస్లీ విలేకరులతో మాట్లాడారు. అమెరికాలో పండిన పంటలను దిగుమతి చేసుకొని బీజేపీ ప్రభుత్వం ఇక్కడి రైతులకు అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. దీంతో దేశంలోని రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యల చేసుకునే పరిస్థితి దాపురిస్తుందని తెలిపారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు రాక, సబ్సిడీ లేక రాయితీలు కరువయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి రూ.3 లక్షల కోట్లు కేటాయించాలని కోరితే రూ.70 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదని అన్నారు.ఈ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్‌, జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ సైదా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -