Thursday, April 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ దోపిడీని ప్రశ్నించని బీజేపీ

బీఆర్‌ఎస్‌ దోపిడీని ప్రశ్నించని బీజేపీ

- Advertisement -

ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ దోపిడీ చేస్తే బీజేపీ ఏనాడు ప్రశ్నించలేదని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ 2014, 2018 మ్యానిఫెస్టోల అమలుపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించి బీజేపీ 2014 నుంచి కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నదని ఆయన విమర్శించారు. 10 ఏళ్లలో ఇచ్చిన హామీల్లో 30 శాతం కూడా అమలు చేయకలేదనీ, పైగా రూ.లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. 10 ఏళ్లు మౌనంగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కావాలని కలలు కంటే సరిపోదనీ, ప్రెస్‌ మీట్‌ లతో ప్రభుత్వాలు మారవనీ, ఐదేళ్లకో సారి ఎన్నికలు వస్తాయని చామల గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -