నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
చంద్రబాబు మద్దతుతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొత్తుగా మారాడని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్లాలోని తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ శ్రీశైలం కట్టినప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు రాజకీయాల్లో ఉన్నావా.. అసలు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీవు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాట్లాడుతున్నావు కానీ ముందు నీ మంత్రివర్గంలో ఓ బిసి మంత్రిని పెట్టావా.. 42 శాతం మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చావా అని కేటీఆర్ ప్రశ్నించారు.
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో… బీసీ డిక్లేరేషన్ లో బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అంతే ఉంటుందని ఆయన అన్నారు. బీసీలను ఘరానా మోసం చేస్తున్నాడని, బనకచర్లను తెలంగాణ సమాజం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. అరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడి ఒక ఎత్తు అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ గా మారి ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారనీ ఆయన అన్నారు. బనకచర్ల గురించి చర్చ అయితే… పోను అన్న రేవంత్ రెడ్డి ఎలా మీటింగ్ కి పోయాడనీ ఆయన ప్రశ్నించారు.అదిత్యనాథ్ ను సాగునిటి సలహాదారుడుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు అని, కాళేశ్వరం, సితారామ ప్రాజెక్టు లకి అనుమతులు ఇవ్వోద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు అని తెలంగాణ హక్కులని కాపాడడానికి కెసిఅర్ ఉన్నాడనీ కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే నే చంద్రబాబు కోవర్టులా పాలన జరుగుతుందని చెప్పాడనీ , బనకచర్ల పై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చకపోతే మరొసారి ఉద్యమానికి బిఅర్ఎస్ సిద్దం అవుతుందనీ,కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కనుసైగలలో నడుస్తుందనీ, చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు గతంలో ఉన్న ప్రాజెక్టే,
గోదావరి జలాల విషయం లో తెలంగాణ కి ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉందనీ, ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారనీ, సియం రేవంత్ కి ఏ బేసన్ లో ఏ ప్రాజెక్టు ఉందన్న విషయం తెలియదనీ, రేవంత్ రెడ్డి కి తెలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని కేటీఆర్ అన్నారు. కెసిఅర్ రాయలసీమ,ఆంధ్రా కూడా బాగుండాలి మావాట తెలాలని కోరారనీ, రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించాలని చుస్తున్నాడనీ, గోదావరి బేసిన్ సింహభాగం మన దగ్గరే ప్రవహిస్తుందని, మా గొడవ ఆంధ్రా ప్రజలతో కాదనీ, మా హక్కు,మా వాట తెలాలని అడుగుతున్నామనీ, జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఆంద్రకి అప్పజెప్తే ఊరుకుంటామా అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు.