నవతెలంగాణ – నవీపేట్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిజెపి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రజాసంఘాల మండల కన్వీనర్ నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలపై ప్రత్యేక సమావేశాన్ని మండల రైతు సంఘం అధ్యక్షులు దేవేందర్ సింగ్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల మండల కన్వీనర్ నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే విషయంలో శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదించిన గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలుపకుండానే రాష్ట్రపతికి పంపడం వల్ల బీసీల రిజర్వేషన్లు కోర్టులో చెల్లకుండా పోయాయని అన్నారు. బీసీల నోటికాడి ముద్దను లాక్కున్న బిజెపి ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో బీసీలు బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజా సంఘాలను బలోపేతం చేసి స్థానిక ఎన్నికల్లో పోటీలో నిలబడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెన్న, వ్యవసాయ కార్మిక సంఘం కన్వీనర్ వసంత్, మహిళా సంఘం నాయకురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: నాయక్ వాడి శ్రీనివాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES