బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
బీసీల న్యాయ పోరాటానికి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ మద్దతు
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా
నవతెలంగాణ – పాలకుర్తి
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండా బిజెపి అడ్డుకుంటూ బీసీల వ్యతిరేక పార్టీగా బిజెపి పని చేస్తుందని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా విమర్శించారు. గురువారం పాలకుర్తిలో ఆ పార్టీ జిల్లా జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజుల సాంబయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో రమేష్ రాజా పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల గణన నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపకపోవడం పట్ల బిజెపి బీసీలకు ద్రోహం చేస్తుందని ఆరోపించారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లులను ఆమోదించకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. 42 శాతం పై హైకోర్టు స్టే విధించిన రాష్ట్రంలో 42% బీసీల రిజర్వేషన్ అమలుకై బీసీ సంఘాలు ఉద్యమాలు చేసేందుకు సిద్ధపడుతున్నాయని, బీసీల ఉద్యమానికి సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. బీసీల రిజర్వేషన్ పై పాల్గవర్గ పార్టీలకు చిత్తశుద్ధి లేదని తీవ్రంగా విమర్శించారు. బిసి రిజర్వేషన్లు 42 శాతం అమలుపై రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, పార్లమెంట్లో చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 18న బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ కు సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ మద్దతు తెలియజేస్తుందని రమేష్ రాజా తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు అనంతోజు రజిత, జీడి సోమయ్య, మండల కార్యదర్శి కొనకటి కలింగరాజు, నాయకులు తూర్పాటి సారయ్య, గాదేపాక బాబు తదితరులు పాల్గొన్నారు.
బీసీల వ్యతిరేకి బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES