నవతెలంగాణ – కేతేపల్లి
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ద్వంద వైఖరితో బీసీ రిజర్వేషన్ లను అడ్డుకుంటుందని సీపీ(ఐ)ఎం జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల విమర్శించారు. గురువారం కేతేపల్లి మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అదాల ప్రమీల మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లును గవర్నర్ కి పంపితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ద్వారా బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవడం బిజెపి ద్వంద వైఖరిని తెలియజేస్తుంది అని అన్నారు.
బిజెపి ఆన్సరిస్తున్న ఈ ద్వంద విధానం వలన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాబట్టి కేంద్రం వెంటనే 42 శాతం రిజర్వేషన్లు అమలు బిల్లును ఆమోదించాలని, పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాలని, 9వ షెడ్యూల్‌లో రిజర్వేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని బిజెపి పార్టీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతపల్లి లూర్తుమరయ్య సీపీఐ(ఎం) మండల నాయకులు కోట లింగయ్య లకపాక రాజు చెరుకు సత్తయ్య చౌగోని నాగయ్య కుకుట్ల శోభన్ వంగూరి వెంకన్న మొదలగు వారు పాల్గొన్నారు.
ద్వంద వైఖరితో బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ: కందాల ప్రమీల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES