Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలురైతులను దగా చేస్తున్న బీజేపీ

రైతులను దగా చేస్తున్న బీజేపీ

- Advertisement -

సబ్సిడీ తొలగించేందుకు కుట్ర చేస్తున్న కేంద్రం 
బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 

ఖరీఫ్ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా రైతులు వరి మొక్కజొన్న పత్తి సాగు చేసుకుంటే ఎరువులు అందించకుండా బీజేపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలో రైతులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాకి ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేయవలసి ఉన్నప్పటికీ సరిపడ యూరియా సరఫరా చేయలేదన్నారు. నానో యూరియా, డి ఏ పి వాడితే ఎక్కువ పంట దిగుబడి వస్తదని, కాలుష్యం ప్రభావం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కానీ రైతులకు ఎలాంటి అవగాహన కల్పించలేదన్నారు.

నానో యూరియా, డిఎపి వల్ల అధిక దిగుబడి, లాభాలు జరిగినట్టు ఇప్పటికి శాస్త్రవేత్తల పరిశోధనలో చెప్పలేదన్నారు. వివిధ రాష్ట్రాలకు ఏకపక్షంగా యూరియా కోత విధించడం వల్ల రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు.కాంగ్రెస్, బిజెపి అంతర్గత రాజకీయ కక్షలతో సబ్సిడీ ఎత్తి వేసే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసేల చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రైతులు కాశ వేణి ఓదాయ్య, దొంతర వేణు, రాములు, మల్లయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad