పార్లమెంటు ముఖద్వారం వద్ద నినాదాలు
చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ
నవతెలంగాణ – ఆలేరు
బీజేపీ చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ముఖ ద్వారం వద్ద సత్యమేవ జయతే అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుండి బుధవారం నవతెలంగాణ తో మాట్లాడుతూ కేంద్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థలైన ఈ డి. సి బి ఐ ఇన్కమ్ టాక్స్ ప్రజాస్వామ్యం అత్యంత కీలకమైన ఎన్నికల కమిషన్ లాంటి సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీల నాయకుల అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. గతంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఇలాంటి సంబంధం లేకున్నా ఈడి కేసులు వేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆధార లేని కేసు కోర్టుకు ఎందుకు తీసుకువచ్చారని పెట్టిన విషయం గుర్తు చేశారు. కేసు కొట్టి వేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక అడ్డదారిన అధికారం చేపట్టేందుకే ఈ సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.
స్వాతంత్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



