ట్రంప్‌నకు బానిసైన మోడీ
కేంద్ర నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా దాన్ని చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపడుతున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అనేది వివాదంగా మారిందన్నారు. నామినేషన్లు వేసి చివరికి కోర్టు తీర్పుతో ఎన్నికలు ఆగిపోవడం కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశానుసారం కులగణన చేపట్టి కమిషన్‌కు పంపిస్తే కమిషన్ విశ్లేషణ చేసి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయవచ్చని సిఫారసు చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు అంగీకరించారని తెలిపారు. కానీ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపితే వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా వారు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అఖిలపక్షంతో సమావేశమై అన్ని పార్టీల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు మోడీ ప్రభుత్వం బానిసగా మారిందని విమర్శిం చారు. దేశ ప్రజలకు హాని తలపెట్టే బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడక తప్పదని హెచ్చ రించారు. రాష్ట్రం లోని వృద్ధ దంపతులపై రాష్ట్ర సర్కార్ చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఉద్యోగులు, కార్మికులు వారి తల్లిదండ్రులను విస్మరిస్తే ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధిస్తామ నడం సమంజసం కాదన్నారు. సోషలిస్టు దేశాల్లో వృద్ధులకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారి ఆలనాపాలన చూసుకుంటుం దన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, దావూద్, రత్నం రాజేందర్, కొప్పుల రఘుపతి, నాయకులు రత్నం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల అమలుకు బీజేపీనే అడ్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



