నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ప్రభుత్వ ధాన్యం నిల్వ గోదామును అక్రమంగా వాడుకుంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ సురేఖకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎనుగుల అనిల్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించిన ధాన్యం గోదామును గత పదేళ్లుగా ఎలాంటి అద్దె చెల్లించకుండా కొంతమంది రైస్ మిల్లు,యజమానులు అక్రమంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి, గోదామును అక్రమంగా వాడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు వాడుకున్న కాలానికి అద్దె వసూలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం గోదామును ఉపయోగించుకోవడానికి టెండర్లు పిలవాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఎనుగుల అనిల్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దొంగల రాములు, పలకల రాజిరెడ్డి, జంగ జైపాల్, కనకం సాగర్, రాసమల్ల శ్రీనివాస్, కోయడ కుమార్ యాదవ్, చెర్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, ఎలుక పెళ్లి సంపత్, దాసరి సంపత్, వడ్లకొండ రాజేందర్, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్, రంజీత్ తదితరులు పాల్గొన్నారు.