నవతెలంగాణ-హైదరాబాద్: స్నాటేషన్ కార్మికులను, డీటీసీ బస్సు డ్రైవర్లను మోడీ బర్త్ డే కార్యక్రమానికి హాజరుకావాలని బీజేపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఢిల్లీ అధ్యక్షులు సౌరబ్ భరద్వాజ్ ఆరోపించారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలోని త్యాగరాజు స్టేడియంలో బర్త్ డే వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ యోత్తున ఆయా కార్మికులు హాజరకావాలని పలువురు బీజేపీ నాయకులు బెదరింపులకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే సొంత బస్సుల్లో డీటీసీ డ్రైవర్లు రావాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బీజేపీ శ్రేణులు దౌర్జాన్యానికి తెగబడ్డారని ఆయన పేర్కొన్నారు.
కార్మికులకు బీజేపీ నాయకుల బెదిరింపులు: ఆప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES