నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి అధ్యక్షతన బిజెపి మండల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ..త్వరలో జరగనున్న స్థానిక సంస్థల జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న ఆశావాహుల వివరాల సేకరణ కోసం ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
అన్ని గ్రామాల కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆయా గ్రామాలలో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ అభ్యర్థులను నిర్ణయించడం జరుగుతుందన్నారు.గ్రామాల వారీగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల జాబితాను రూపొందించినట్లు వివరించారు. ఎంపిక చేసిన ఆశావాహుల జాబితాను అధిష్టానానికి పంపడం జరిగిందన్నారు. ఆశావాహుల పూర్తి వివరాలను పరిశీలించి గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మండల విస్తృతస్థాయి సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES