Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంమోడీ పర్యటనకు బీజేపీ మంత్రి దూరం

మోడీ పర్యటనకు బీజేపీ మంత్రి దూరం

- Advertisement -

– కుమారుల అరెస్టుతో కినుక
వడోదర:
ప్రధాని నరేంద్ర మోడీ తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో సోమ, మంగళ వారాలలో పర్యటించారు. వడోదర, దాహోద్‌లలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే ఈ పర్యటనలో రాష్ట్ర సహాయ మంత్రి బచ్చూభారు ఖబాద్‌ ఎక్కడా కన్పించలేదు. ఉపాధి హామీ పథకం కుంభకోణంలో ఖబాద్‌ ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఆయన కినుక వహించి మోడీ పర్యటకు డుమ్మా కొట్టారని తెలుస్తోంది. కాగా కుమారులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పదవి నుండి వైదొలిగేందుకు ఖబాద్‌ ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో ఆయనను భూపేంద్ర పటేల్‌ క్యాబినెట్‌ నుండి తొలగిస్తారని తెలుస్తోంది. కాగా మోడీ పర్యటనకు ఖబాద్‌ను కావాలనే దూరం పెట్టామని బీజేపీ చెబుతోంది. దేవ్‌గడ్‌ బడియా నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖబాద్‌ను మోడీ పర్యటనలో పాల్గొనకుండా చేయాలని గత వారమే నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దాహోద్‌ జిల్లా మంత్రి కుబేర్‌ దిందోర్‌ ఆధ్వర్యంలో జరిగిన పలు రహస్య సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని పార్టీ వర్గాలు చెప్పాయి. కాగా ఖబాద్‌కు దిందోర్‌ అత్యంత సన్నిహితుడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad