Friday, June 27, 2025
E-PAPER
Homeజాతీయంయువతను బెదిరిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే

యువతను బెదిరిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ముంబయి :   తమ  ప్రభుత్వం కారణంగానే దుస్తులు, బూట్లు, మొబైల్‌ ఫోన్‌లు వచ్చాయని గుర్తుంచుకోవాలంటూ  బిజెపి ఎమ్మెల్యే ఒకరు  యువతను బెదిరించారు.  మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  పర్తూర్‌ బిజెపి ఎమ్మెల్యే బాబన్‌రావ్‌ లోనికర్‌ గురువారం నియోజకవర్గంలో నిర్వహించిన ‘హర్‌ఘర్‌ సోలార్‌ పథకం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అక్కడ యువతను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ”మా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే ముందు .. మా వల్లే మీకు దుస్తులు, బూట్లు, మొబైల్‌ ఫోన్లు, విత్తనాలకు నగదు, పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు అందుతున్నాయని తెలుసుకోండి” అని అన్నారు. ” మాపార్టీని విమర్శించే ముందు కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా యువత .. మా కారణంగానే ఈ గ్రామంలో ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకులు, కాంక్రీట్‌ రోడ్లు, ఫంక్షన్‌ హాళ్లు వచ్చాయి. వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయి. మమ్మల్ని విమర్శించే వారి తల్లులకు జీతాలు ఇచ్చారు. వారి తండ్రులకు పెన్షన్లు కూడా మంజూరుచేశారు. ప్రధాని మోడీ మీ తండ్రికి విత్తనాలు కోసం రూ.6,000 ఇచ్చారు. లడ్కీ, బెహన్‌ యోజన ద్వారా మీ సోదరి ప్రయోజనం పొందుతోంది. మీ దగ్గర ఉన్న దుస్తులు, బూట్లు, మొబైల్‌ ఫోన్లు మావల్లనే వచ్చాయి గుర్తుంచుకోండి ” అని ఎమ్మెల్యే వీడియోలో పేర్కొన్నారు.

బిజెపి ఎమ్మెల్యే అవమానకర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బాబన్‌రావ్‌ లోనికర్‌ బ్రిటీష్‌ వారి స్వదేశీ వెర్షన్‌ అని శివసేన (యుబిటి) ఎమ్మెల్సీ, శాసన మండలిలో ప్రతిపక్ష నేత అంబదాస్‌ దన్వే మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి భాష తగదని అన్నారు. ప్రజలే వల్లే మీకు ఎమ్మెల్యే హోదా వచ్చిందని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మీ దుస్తులు, బూట్లు, విమాన టిక్కెట్లు, ఎమ్మెల్యే హోదా, చివరికి కారులో డీజిల్‌ కూడా ప్రజలవల్లే వచ్చాయని అన్నారు. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి నేతలకు బుద్ధి చెప్పాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -