Tuesday, December 16, 2025
E-PAPER
Homeజాతీయం‘ఉపాధి హామీ’పై..బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల కుట్రలు: కాంగ్రెస్‌

‘ఉపాధి హామీ’పై..బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల కుట్రలు: కాంగ్రెస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ బిల్లు స్థానంలో కేంద్రం వికసిత్‌ భారత్‌ – రోజ్‌గర్‌ అజీవికా మిషన్‌ (గ్రామీణ్‌) కోసం హామీ బిల్లు (విబి-జి ఆర్‌ఎఎమ్‌ జి) 2025ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. మహాత్మాగాంధీ పేరు లేకుండా తెస్తున్న ఈ కొత్త బిల్లుపై కాంగ్రెస్‌ ఎంపి ప్రియాంకగాంధీ వ్యతిరేకించనున్నారు. అలాగే ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం గురించి మాత్రమే కాదు… ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ చట్టాన్ని అంతం చేయడానికి బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌లు చేసిన కుట్ర ఇది. సంఘ్‌ శతాబ్ది సందర్భంగా గాంధీ పేరును తొలగిస్తున్నారు. దీన్నిబట్టే మోడీజీలాగా విదేశీ గడ్డపై బాపుకు పూలు అర్పించేవారు పైకి ఎంత కపటంగా ఉన్నారో తెలుస్తుంది. పేదల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వమే ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎపై దాడి చేస్తుంది. పేదలు, కార్మికులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా పార్లమెంటులో కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుంది అని మల్లికార్జున ఖర్గే అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -