Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీని గద్దె దించాలి : కల్వకుంట్ల కవిత

బీజేపీని గద్దె దించాలి : కల్వకుంట్ల కవిత

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హర్యానాలో బీజేపీని గద్దె దించే సమయం ఆసన్నమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. గురువారం హర్యానాలో నిర్వహించిన మాజీ ఉప ప్రధాని దేవీలాల్‌ 112వ జయంతి ఉత్సవంలో ఆమె పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవీలాల్‌ను దేశంలోని రైతులందరూ ప్రేమిస్తారని తెలిపారు. రైతుల కోసం దేవీలాల్‌ ఎంతో చేశారని కొనియాడారు. ప్రస్తుతం దేశంలోనూ, హర్యానాలోనూ రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వమున్నదని చెప్పారు. రైతులను ఏళ్లతరబడి జైళ్లలో వేస్తున్నదని విమర్శించారు. ఐఎన్‌ఎల్డీ నేత అభరు హర్యానాలో ముఖ్యమంత్రి అయితేనే రైతుల కష్టాలు తీరుతాయన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -