Monday, March 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టు

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగిన నేపథ్యంలో అక్కడకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సిద్ధమయ్యారు. అదే సమయంలో కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వారు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్కడకు కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి రామచందర్ రావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు, ఆ తర్వాత అరెస్టు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -