- Advertisement -
నవతెలంగాణ -పాపన్నపేట : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాతను బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు, మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ వారిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. వారి వెంట రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు.
- Advertisement -