ఐద్వా నాయకురాలి ఇంటిపై దాడి, గేటుకు తాళం
నవతెలంగాణ-అగర్తల
త్రిపురలో బిజేపీ బరితెగించింది. బీజేపీ నేతత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఐద్వా చేపడుతున్న ఉద్యమంలో వివిధ వర్గాల మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు చూసిన బీజేపీ , ఈ సానుకూల పరిణామాలను అణచివేయడానికి ఫాసిస్ట్ దాడులకు పాల్పడుతోంది. ఇందుకు నిదర్శనమే ఆదివారం రాత్రి ఐద్వా మోహన్‌పూర్ సబ్-డివిజనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ జర్నా మజుందార్ ఇంటిపై జరిగిన దాడి. ఆమె ఇంటి తలుపులు, కిటికీల గోడ, ప్యానెల్‌లను నల్లరంగుతో ధ్వంసం చేసింది. అంతేకాక బయటి నుంచి తలుపు, గేటుకు తాళం వేసింది. జర్నా మజుందార్ చురుకైన పార్టీ, ఐద్వా కార్యకర్త. ఆమె రాబోయే సబ్-డివిజనల్ అండ్ జిల్లా సమావేశాలకు విస్తతంగా సిద్ధమవుతోంది. వీటిలో మోహన్‌పూర్ సబ్-డివిజనల్ సమావేశం నేడు జరుగనుంది. ఈ సానుకూల పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ దుండగుల బృందం ఆమె ఇంటిపై దాడికి ఒడిగట్టింది.