- Advertisement -
ఈసీ నోటీసు
పాట్నా: బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ డ్రైవ్‌పై వివాదం కొనసాగుతున్నది. తాజాగా బీజేపీకి చెందిన మహిళా మేయర్‌కు రెండు ఓటరు కార్డులున్నట్టు బయటపడింది. దీంతో ఆ నాయకురాలికి ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటీస్ జారీ చేసింది. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. దీంతో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను ఈసీ చేపట్టింది. అయితే కొత్త ఓటర్లు భారీగా చేరడం, లక్షల్లో ఓటర్లను తొలగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ముజఫర్‌పూర్ మేయర్, బీజేపీ నాయకురాలు నిర్మలా దేవికి రెండు ఓటరు కార్డులు న్నట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగస్ట్ 16 లోపు వివరణ ఇవ్వాలంటూ ఈసీ నోటీస్ జారీ చేసింది.
- Advertisement -