హిందుత్వవాదం, నిత్య ఘర్షణలతో ఓట్ల రాజకీయం
అమలుకానీ హామీలతో కాంగ్రెస్ హడావుడి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-నేలకొండపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలతో లౌకికవాదానికి పెనుముప్పు సంభవించే ప్రమాదం ఉందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ విధానాలను తిప్పి కొట్టేందుకు పార్టీ శ్రేణులు ప్రజలను చైతన్య వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటా పురం గ్రామంలోని బీకేఆర్ ఫంక్షన్ హాల్‌లో పాలేరు డివిజన్ నాయకులు మల్లెల సన్మాతరావు అధ్యక్షతన జరిగిన సభలో తమ్మినేని మాట్లా డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి హిందుత్వ, మతోన్మాద విధానాలతో ప్రజల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నదని అన్నారు. ఇటీవల ప్రపంచ యుద్ధాలపై జరుగుతున్న పరిణామాలతో ప్రజల నుంచి వచ్చిన పిటిషన్‌పై స్పందించిన మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ అసమర్థ విధానాలకు అద్ధం పడుతోంద న్నారు. దేశంలోని న్యాయవ్యవస్థలను సైతం తప్పుదారి పట్టిస్తూ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే కుట్రలో భాగంగా ఇటీవల బీహార్‌లో ఓట్ల సవరణ పేరుతో అక్కడి ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయ త్నిస్తోందన్నారు. ఇటీవల భారత్, బ్రిటన్ మధ్య ప్రధాని మోడీ చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పం దం వల్ల దేశ ప్రజలకు తీవ్ర నష్టం కలిగే ప్రమా దం ఉందని తెలిపారు. బీసీల సంక్షేమాన్ని ఏనా డూ పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ.. బీసీ రిజర్వేషన్ల పేరుతో ఓట్లు దండుకునేం దుకు ప్రయత్నిస్తోం దన్నారు. బీసీ రిజర్వేషన్ విష యాన్ని బీజేపీ నిశితంగా పరిశీలిస్తూ ఆచితూచి అడుగేసేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. కులాల లెక్కలతో హిందువులను ఐక్యం చేయడం సాధ్యం కాదనే భయంతో కులాన్ని మరిపించి మతాన్నిపైకి లేపేందుకే బీజేపీ మొగ్గు చూపుతుందన్నారు.
‘స్థానిక’ ఎన్నికలతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి అమలు కానీ హామీలతో స్థానిక ఎన్నికల పేరుతో హడావుడి చేస్తుందని తమ్మినేని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం.. నాలుగున్నర లక్షల ఇండ్ల నిర్మాణానికి సుమారు రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తామని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ పేదలను ఇందిరమ్మ ఇండ్ల ఆశల పేరుతో భ్రమలో ముంచడమేనన్నారు. ప్రజలను సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే రాష్ట్రంలో కాళేశ్వరం, బనకచర్ల సాగునీటి ప్రాజెక్టుల నిర్మా ణాలు, నీటి వాటాల పంపకాలు, ఫోన్ ట్యాపిం గులు వంటి చర్చల పేరుతో కాలయాపన చేస్తోం దని విమర్శించారు. ఈ విషయంలో ప్రతి పక్ష బీఆర్‌ఎస్ పార్టీ కూడా ఆంధ్ర, తెలంగాణ నీటి వాటాల పేరుతో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మరో సారి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తుం దన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, పాలేరు డివిజన్ కమిటీ ఇన్‌చార్జి బండి రమేష్, జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, షేక్ బషీరుద్దీన్, బండి పద్మ, నేల కొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్, తిరుమ లాయపాలెం మండలాల కార్యదర్శులు కేవీ రామి రెడ్డి, తోటకూరి రాజశేఖర్, ఊరడి సుదర్శన్‌రెడ్డి, కొమ్ము శ్రీను, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ మతోన్మాదంతో లౌకికవాదానికి పెనుముప్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES