Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్బీహార్ లో పాగ వేసేందుకు ఎన్నికల్లో బీజేపీ కుట్ర

బీహార్ లో పాగ వేసేందుకు ఎన్నికల్లో బీజేపీ కుట్ర

- Advertisement -

ఓట్ల గల్లంతుపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సెమినార్
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

బీహార్ ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే కుట్రతో బీజేపీ ఆ రాష్ట్రంలోని 65 లక్షల ఓటర్లను తొలగించిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆరోపించారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం జరగడంతో పాటు సుప్రీం కోర్టులో పిల్ వేయడంతో తొలగించిన ఓటరు జాబితాను మళ్లీ ప్రదర్శించాలని కోర్టు ఆదేశించిందన్నారు. శుక్రవారం బాశెట్టి మాదవరావు స్మారక కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో బీహార్ లో ఓట్ల గల్లంతు.. ప్రజాస్వామికవాదుల కర్తవ్యం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని బీహార్ లో ఓట్ల తొలగింపు ఏ విధంగా జరిగింది.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తీరును వివరించారు. 

ఓటును హక్కును రక్షించేందుకు పోరాడాలి

భారత ఎన్నికల కమిషన్  భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 322 ద్వారా 1950 లో ఒక స్వాతంత్ర రాజ్యాంగ సంస్థగా ఏర్పడిందని దర్శనాల మల్లేష్ అన్నారు. ఎన్నికలను  నిష్పాక్షికంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం ఏర్పడిన సంస్థ 18 సంవత్సరాలు నిండిన భారత దేశ పౌరులందరికీ ఓటు హక్కును కలిపించాల్సిన బాధ్యత కలిగిన సంస్థ అలాంటి ఈ సంస్థ నేడు బీజేపీ బీ టీం గా మారి ప్రతిపక్ష మద్దతు దారుల ఓట్లను కొల్లగొట్టే పని చేయడం విచారకరం అన్నారు. బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) పేరుతో 65 లక్షల మంది ఓట్లను తొలగించిందని అన్నారు. పౌరులు, ప్రతిపక్షాలు పోరాటం చేసిన ఫలితంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, తిరిగీ అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కును కల్పించే చర్యలు చేపట్టిందన్నారు. ప్రజస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ ఖూనీ చేసిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించిన ఓటును రక్షించుకోవడానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పోరాడాలని పిలుపునిచ్చారు.

కుట్రలు పన్నుతున్న బీజేపీ

బీహార్ ఎన్నికల్లో బీజేపీ తన పగను వేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈ క్రమంలో జనదళ్ పార్టీకి అనుకూలంగా ఉన్న 65 లక్షల ఓట్లను తొలగించిందన్నారు. బీజేపీకి తొత్తుగా ఎన్నికల సంఘం కూడా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అక్కడి ప్రజలు ఓట్ల తొలగిపుపై ఉద్యమించడంతో ప్రతిపక్షాలు వారికి మద్దతుగా నిలవడంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారన్నారు. సుప్రీం కోర్టు ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు దాన్ని ఎవరు తొలగించలేరని పేర్కొందన్నారు. తొలగించిన వారిని పునరిస్తు జాబితాను ప్రదర్శించాలన్నారు. తొలగింపు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని ఆదేశాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును కాపాడుకునేల ప్రజాస్వామికవాదులు సంఘటితంగా పోరాటం చేయాలన్నారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  లంక రాఘవులు, పూసం సచిన్, అన్నమొల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న, ఆర్.మంజుల, ఆర్ సురేందర్, నెల్ల స్వామి, ఎం.గంగన్న, నాయకులు బొజ్జ గంగారాం, కోట్నక్ సాకారం, అగ్గిమల్ల స్వామి, అరవింద్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad