Saturday, December 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేపీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర 

బీజేపీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర 

- Advertisement -

– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు వ్యతిరేక బిల్లులు తీసుకువచ్చి కుట్ర చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. శనివారం  హుస్నాబాద్ లో గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఎన్నికల ఎజెండా లో అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి హామీ తీసుకొస్తామని చెప్పిన  కేంద్రం చివరకు ఉపాధి హామీ పథకానికి నిర్వీర్యం చేస్తుందన్నారు.

మహాత్మా గాంధీ పేరును అవమానపరిచే విధంగా ఉపాధి హామీ పథకం లో ఆయన పేరునుతొలగించి విబి రామ్ జీ పేరును తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే నెహ్రూ, ఇందిరా గాంధీ ,మహతా గాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ఫోటోలు పెట్టుకొని ఉపాధి కార్యక్రమాలు చేస్తూ బిల్లుపై నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, మాజీ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, చిత్తరి రవీందర్ తదిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -