రాష్ట్రంలో మద్దతు ఇస్తూ కేంద్రంలో అడ్డుకుంటున్న బీజేపీ
బిజెపి విధానాలకు వ్యతిరేకంగా బీసీ సంఘాలు పోరాటం చేస్తేనే మద్దతుగా పాల్గొంటాం
లేకుంటే స్వతంత్రంగా పోరాటం చేస్తాం
జిల్లాలోని బీసీ ప్రజలంతా బీసీ బిల్లును అడ్డుకుంటున్న బిజెపికి వ్యతిరేకంగా బందులో పాల్గొని విజయవంతం చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముశం రమేష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
బీసీ రిజర్వేషన్లపై బిజెపి నాటకం ఆడుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాల జేఏసీ అక్టోబర్ 18న రాష్ట్ర బందుకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బందులో బీసీ సంఘాలన్నీ బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే సీపీఐ(ఎం) మద్దతుగా పాల్గొంటుంది. లేకుంటే స్వతంత్రంగా బీసీ రిజర్వేషన్లకు పోరాటం చేస్తుందని బందులో స్వతంత్రంగా పాల్గొంటుందినీ రమేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్దతు ఇస్తూ కేంద్రంలో బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటుందని అన్నారు.
బీసీలకు ద్రోహం చేస్తున్న బిజెపి పార్టీ విధానాలపై బీసీ ప్రజలందరూ వ్యతిరేకించాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. హిందూ మతం పేరు చెప్పుకొని బీసీల ఓట్లు దండుకుంటూ అగ్ర కులాల వారు అధికారం చెలాయిస్తూ బీసీలను రాజ్యాధికారం నుండి దూరం ఉంచాలని, బిసి రిజర్వేషన్ బిల్లును కావాలని అగ్రకులాల పార్టీ అయినా.. బిజెపి అడ్డుకుంటుందని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించేంతవరకు బీసీల పక్షాన సీపీఐ(ఎం) పోరాటం చేస్తుంది అని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బండి సంజయ్ ని నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించిన బీసీ ప్రజలందరూ నిలదీయాలని అన్నారు. మందిర్ మసీదుల గురించి మాట్లాడి మత విద్వేషాలు రెచ్చగొట్టే బండి సంజయ్
బీసీ వై ఉండి కూడా పార్లమెంటులో బీసీ బిల్లు గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. అక్టోబర్ 18న జరిగే రాష్ట్ర వ్యాప్తంగా బందులో జిల్లాలోని బీసీ ప్రజలందరూ బిజెపి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పాల్గొని బందును విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి కోడం రమణ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాటకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES