Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీది ద్వంద్వ వైఖరి

బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీది ద్వంద్వ వైఖరి

- Advertisement -

– ముస్ల్లిీంలను సాకుగా చూపి అడ్డుకోవాలనుకోవడం సరికాదు
– లాబియింగ్‌లు పక్కన పెట్టి ప్రజాఉద్యమం చేపట్టాలి: ఎస్‌వీకే వెబినార్‌లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు పిలుపు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, బీసీ ఇంటలెక్చువల్‌ ఫోరం చైర్మెన్‌ టి.చిరంజీవులు విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందా?’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులు పార్లమెంట్‌లో ఆమోదం పొంది రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ అమలుకు బీజేపీ కుంటి సాకులు చూపిస్తోందని విమర్శించారు. ముస్లీం సామాజిక వర్గాన్ని సాకుగా చూపి రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లను సాధించిన తమిళనాడు సర్కార్‌లా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన 27 శాతం రిజర్వేషన్లు కూడా ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని బీసీ వర్గాలు లాబియింగ్‌ పక్కన పెట్టి స్వరాష్ట్ర ఉద్యమం తరహాలో కేంద్రంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రజక వృత్తిదారుల సంఘం కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రెండు బిల్లులను కేంద్రంలోని మోడీ సర్కార్‌ ముస్లీంలను బూచిగా చూపి అడ్డుకుంటోందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న బీసీల రిజర్వేషన్లలో కూడా ముస్లీంలు ఉన్నారని గుర్తు చేశారు. ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్న బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అడ్డుకుం టోందని ప్రశ్నించారు. మతాల వారీగా రిజర్వేషన్ల అమలు సరికాదని రాజ్యాంగంలో ఉందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad