Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుయూరియాపై బీజేపీది తప్పుడు ప్రచారం

యూరియాపై బీజేపీది తప్పుడు ప్రచారం

- Advertisement -

– తెలంగాణ వాటాను కేంద్రం వెంటనే విడుదల చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
: వానాకాలం సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు దాటినా కావా ల్సిన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైం దనీ, పైగా ఈ విషయంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ విమర్శించింది. తెలంగాణ వాటాను కేంద్రం వెంటనే విడుదల చేయాలనీ, ఈ విషయంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. యూరియా కోసం రైతులు నెల రోజులుగా రోడ్లపైకి వస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు కుంటి సాకులు చెబుతూ ”కృత్రిమ కొరత” సృష్టించారనే తప్పుడు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు.
రాష్ట్రానికి 9.8 లక్షల టన్నులు యూరియా కావాల్సి ఉంగా 1.5 లక్షల టన్నులను తగ్గించిందని గుర్తుచేశారు. కేటాయించిన కోటాను కూడా ఇంత వరకు సకాలంలో సరఫరా చేయకుండా కేంద్రం జాప్యం చేస్తున్నదనీ, దాంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని తెలిపారు. రైతులంతా సహకార సంఘాలు, షాపుల ముందు పడిగాపులు కాస్తుంటే…ఆందోళనలు చేస్తుంటే బీజేపీ నేతలు తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవాలని చూడటం దారుణమని విమర్శించారు. రాష్రంలోని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచైనా రాష్ట్ర అవసరాలకు యూరియాను సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కోరినా ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎత్తిచూపారు. దీంతో 45 కేజీల యూరియా బస్తా రూ.242కాగా, ప్రస్తుతం బ్లాక్‌ మార్కెట్‌లో రు.350కి అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం యూరియా కొరతను తీర్చడానికి, బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధించడానికి చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వం హాకా, సహకార సంఘాల ద్వారా సరిపడా ఎరువు లను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి అవస రమైన యూరియాను కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించడానికి అన్ని రకాల చర్య లు తీసుకొవాలనీ, రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad