నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ముంబైలో వరదలు పొటెత్తాయని ఆదిత్య థాకరే విమర్శించారు. ఈ ఏడాది వానాలు ముందుగానే పడతాయని సమాచారమున్న..బీజేపీ సర్కార్ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. దీంతో ఆరుగాలం శ్రమించి రైతులు సాగు చేసిన పంటలు నీటమునిగాయని, దీనికి ఫడ్నవీస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆదిత్య థాకరే ఆరోపించారు. లక్షల హెక్టార్‌ల్లో పంటలు నీటి పాలైయ్యాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పుణే, థానే వంటి ముఖ్యనగరాలు వరద నీటమునిగి..ప్రజలు అనేక కష్టాలు పడ్డారని వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ ఆపరేషన్ సిందూర్ తరహాలో వరద కష్టాల నుంచి ముంబై ప్రజలను ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు. ఎలాంటి సహాయాక చర్యలు చేపట్టకుండా బీజేపీ ప్రభుత్వం ముంబైని అంతం చేయాలని చూస్తుందా? అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా థాక్రే దుయ్యబట్టారు. అకాల వర్షాలు ముంబైని నీట ముంచెత్తిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ వరద నీటితో రోడ్లు నీటిమునిగి జలాశయాలను తలపించాయి.
బీజేపీ నిర్లక్షమే ముంబై వరదలకు కారణం: ఆదిత్య థాకరే
- Advertisement -
- Advertisement -