నవతెలంగాణ-హైదరాబాద్: మహిళ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం రాజకీయ చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 15న విపక్షాలు భేటీ కానున్నాయి. ఆ సమావేశంలో సదురు బిల్లు పై చర్చించి ఓ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని ఢిల్లీ మీడియా సమావేశంలో చెప్పారు.
కిరణ్ రిజిజు నుంచి తనకు లేఖ అందిందని, తమ ఎజెండాను వారి ముందు ఉంచామని తెలిపారు. జనాభా లెక్కలు నిర్వహించకుండా నారీ శక్తి వందన అధినియం మహిళా రిజర్వేషన్ ఆమోదంతో ఉపయోగం ఉండదని, ఈ అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ కోసం కేంద్రం 2011 జనాభా లెక్కల డేటాతో ముందుకు వెళ్లాలని యోచిస్తోందన్నారు. సరైన ప్రణాళిక లేకుండానే డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి పార్లమెంట్ ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల ప్రత్యేక సమావేశానికి మోడీ సర్కార్ సిద్ధమవుతోందని తెలియజేశారు.



