Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమతోన్మాదమే ఎజెండాగా బీజేపీ పాలన

మతోన్మాదమే ఎజెండాగా బీజేపీ పాలన

- Advertisement -

400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఈ పాటికే తిరగరాసేది : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మతోన్మాదమే ఎజెండాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి విమర్శించారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు వచ్చి ఉంటే ఈ పాటికే రాజ్యాంగ స్ఫూర్తి తూట్లు పొడిచి మార్చే ప్రయత్నాలు చేసి ఉండేదని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పల్లా వెంకట్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నరసింహా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్‌, ఎస్‌.ఛాయాదేవి, నేదునూరి జ్యోతి, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌, రాష్ట్ర నాయకులు ప్రేమ్‌పావని, పల్లె నర్సింహ్మా, రాపోలు సుదర్శన్‌, మారపాక అనిల్‌ కుమార్‌, ఎన్‌.శ్రీకాంత్‌, రాజమౌళి పాల్గొన్నారు.

పల్లా మాట్లాడుతూ..ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో దేశ పాలన నడుస్తున్నదన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా గవర్నర్ల వ్యవస్థ తయారైందని విమర్శించారు. ఆ వ్యవస్థను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనాలను కాపాడే విధంగా వారికి లక్షల కోట్లు రాయితీలను ఇస్తూ బడ్జెట్‌ ప్రవేశ పెడుతోందని విమర్శించారు. ఈ వ్యవస్థ మారితే తప్ప సమాజంలో సమానత్వం రాదనీ, అందుకు బీజేపీని గద్దె దించడమే మార్గమని నొక్కి చెప్పారు. రామకృష్ణ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందపర్చుకున్న లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహా మాట్లాడుతూ..బీజేపీ ప్రజలందర్నీ మత విద్వేశాల వైపు మళ్లిస్తూ అరాచక పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -