రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగాన్ని కాపడేవారిగా ఉండాలి..
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండగుర్ల లింగన్న
నవతెలంగాణ – జన్నారం
బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత కాకుండా చేసిన బిజెపి కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలని సీపీఐ(ఎం) జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న అన్నారు. శనివారం మండల కేంద్రంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ .. 42% బీసీ రిజర్వేషన్ల చట్ట బద్దత కల్పిస్తూ రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చాలన్నారు.
బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని బీజేపీ చెందిన 8 ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామాలు చెయ్యలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 50% నిబంధనను ఎత్తి వేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్తారన్నారు. కార్యక్రమంలో నాయకులు అంబటి లక్ష్మణ్, కూకటికారి బుచ్చయ్య, ఎస్కే అబ్దుల్లా, జయ, గుడ్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.



