- Advertisement -
- – ఓట్ చోర్ దేశమంతా విస్తరణ కోసం మోడీ ప్రయత్నం….
– బీహార్ ప్రత్యేక ఓటర్ సవరణ లోపాలు, రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు - నవతెలంగాణ – ఖమ్మం
- స్థానిక నగర కేంద్రంలోని మంచి కంటి ఫంక్షన్ హాల్ లో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏ జబ్బర్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు , వివిధ సంస్ధల బాధ్యులు, వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఎస్ఐఆర్ పేరుతో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశంలో మైనారిటీ దళిత ఆదివాసీల ఓట్లను తీసేసి కుట్రలో జరుగుతుందని దానిలో భాగంగానే ఎస్ఐఆర్ పేరు మీద చేస్తున్న దాష్టీకం అని బిజెపి విధానాలను విమర్శించారు.
- ఇప్పటికే బీహార్లో 22 లక్షల మహిళా ఓటర్లను అందులో ముస్లిం దళిత ఆదివాసి మహిళల ఓట్లను తొలగించి ఆ పేరు మీద ఎన్ఆర్సి ని తీసుకురావడం కోసం చేసే కుట్రాని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అని ఆరోపించారు. ఇప్పటికే దేశంలో బిజెపి ప్రభుత్వం ఓట్లను దొంగలించి గద్దెనెక్కి ప్రజల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఇకనుంచి ఓట్లను కూడా తొలగించి నేరుగా ప్రజలకు అవకాశం లేకుండా తమ ప్రభుత్వం ఏర్పాటు కోసం కొన్ని చట్టాలను తీసుకుని వస్తుంది అని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ను తమ గుప్పిట్లో మోడీ ప్రభుత్వం పెట్టుకుని నాటకాలు ఆడుతుంది అని ఆరోపించారు. స్వాతంత్ర సంగ్రామంలో మూల ఆదివాసి ప్రజలే తిరగబడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని తరిమికొట్టిన చరిత్ర వుంది అని పేర్కొన్నారు .
- ఇప్పుడు మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య. ప్రాంతాల మధ్య విభజన కోసం బిజెపి , RSS శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని వక్తల అభిప్రాయపడ్డారు. బిజెపి చేస్తున్న ఈ అరాచకపు కుటిల రాజకీయాలను తిప్పి కొట్టేదానికోసం ప్రజలకు మరో స్వాతంత్ర సంగ్రామానికి సిద్ధం కావలసినటువంటి సమయం ఆసన్నమైందని వక్తలు అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బిచ్చల తిరుమల్ రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ ఆరిఫ్, ప్రముఖ విద్యావేత్తలు రవి మారుతి, ఐ వి రమణారావు, జమాతే ఇస్లామీ హింద్ ఖమ్మం కార్యదర్శి ఎస్కే కాసిం, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అసద్, టిఆర్ఎస్ పార్టీ మైనార్టీల అధ్యక్షులు తాజుద్దీన్, సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రం, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్ , వివిధ ప్రజాసంఘాల రాజకీయ నాయకులు చిరా రవి, మేకల సుగుణ రావు, ఎస్ కే మీరా సాహెబ్ , మొహమ్మద్ అసిఫ్, మొహమ్మద్ సాద్, టిఆర్ఎస్వి నగర్ కార్యదర్శి మునాఫ్, సిఐటియు జిల్లా నాయకులు ఎస్ నవీన్ రెడ్డి బోడపాట్ల సుదర్శన్ , టిపిటిఎఫ్ జిల్లా బాధ్యులు విజయ్, ప్రముఖ న్యాయవాది ఖయ్యుం, జక్కంపూడి నాగేశ్వరరావు, విద్యావంతులు వేదిక కన్వీనర్. బండారు రమేష్, కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం మనోహర్, వ్యవసాయ కార్మిక సంఘం మెరుగు సత్యనారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మెరుగు రమణ, రిటైర్డ్ సీఐ యాకుమియా ఆవాజ్ నాయకులు ఎస్ కే బాబు ,ఎస్కే నాగుల్ మీరా, ఎస్కే సత్తార్, వివిధ ప్రజాసంఘాలు నగరంలో సామాజిక కార్యకర్తలు వివిధ రంగాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -