నవతెంగాణ – నెల్లికుదురు
మండలంలోని మండల వీడు గ్రామంలోని 670, 719 సర్వే నెంబర్లు ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి రైతులకు అనుగుణంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు వినతి పత్రాన్ని అందించినట్లు ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ నల్లని శోభా పాపారావు తెలిపారు. గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభాని కి వచ్చిన ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని రైతులకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం భూమిని గుర్తించి దాన్ని ఆరబోసుకునే విధంగా స్థలాన్ని గ్రామాలలో ఉంచడానికి కృషి చేయాలని అన్నారు. ఈ గ్రామంలో ఐకెపి మరియు పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఒడ్లు ఆరబోసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందని అన్నారు.
ఎమ్మెల్యే భూక్యమురళి నాయక్ కు నల్లని శోభ పాపారావు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



