- Advertisement -
హైదరాబాద్ : యుఎస్, హాంగ్‌కాంగ్‌లో కార్యకలాపాలు కలిగిన రీటెక్ ఎన్విరోటెక్ ప్రయివేటు లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న బ్లాక్ గోల్డ్ రీసైక్లింగ్ తెలిపింది. దీంతో దేశంలో లిథియం అయాన్ బ్యాటరీలు, ప్లాస్టిక్‌లు, సోలార్ ప్యానెల్‌లు, ఇ-వ్యర్థాలతో సహా వివిధ రకాల వ్యర్థాల కోసం స్థిరమైన రీసైక్లింగ్ పరిష్కారాలను విస్తృతం చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా రీటెక్ ఎన్విరోటెక్ సిఇఒ పంకజ్ తిర్మన్వార్ బ్లాక్ గోల్డ్‌లో సహ వ్యవస్థాపకుడు, బోర్డు సభ్యునిగా చేరనున్నారు.
- Advertisement -

                                    

