Tuesday, September 30, 2025
E-PAPER
Homeఆటలుముగిసిన బ్లాక్‌హాక్స్‌ వాలీబాల్‌ లీగ్‌

ముగిసిన బ్లాక్‌హాక్స్‌ వాలీబాల్‌ లీగ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ వర్శిటీ వాలీబాల్‌ లీగ్‌లో సిల్వర్‌ వోక్స్‌, డిపిఎస్‌ నాచారం జట్లు చాంపియన్లుగా నిలిచాయి. ఆరు వారాల పాటు సాగిన స్కూల్‌ లీగ్‌ సోమవారం యూసుఫ్‌గూడలోని ఇండోర్‌ స్టేడియంలో ఫైనల్స్‌తో ముగిసింది. బాలికల విభాగం ఫైనల్లో సిల్వర్‌ వోక్స్‌ 3-0తో చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌పై ఘన విజయం సాధించింది. బాలుర విభాగం ఫైనల్లో ది గాడియం స్కూల్‌పై 3-1తో డిపిఎస్‌ నాచారం గెలుపొందింది. ప్రొఫెషనల్‌ స్థాయి నైపుణ్యాలు ప్రదర్శించిన విజేతలను హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ యజమానికి అభిషేక్‌ రెడ్డి కంకణాల అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -