Friday, October 17, 2025
E-PAPER
Homeఆటలుబ్లాక్‌హాక్స్‌ గెలుపు

బ్లాక్‌హాక్స్‌ గెలుపు

- Advertisement -

3-1తో గోవా గార్డియన్స్‌పై పైచేయి

హైదరాబాద్‌ : ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) సీజన్‌ 4లో ఆతిథ్య జట్టు హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పుంజుకుంది. గురువారం గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో గోవా గార్డియన్స్‌పై 15-13, 20-18, 15-17, 15-19తో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ అదిరే విజయం సాధించింది. ఎటాక్‌, డిఫెన్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ సూపర్‌ సర్వ్‌లు, కళ్లు చెదిరే స్పైక్‌లతో దండెత్తింది. గ్రూప్‌ దశలో రెండో విజయం ఖాతాలో వేసుకున్న బ్లాక్‌హాక్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. బ్లాక్‌హాక్స్‌ స్పైకర్‌ యుడి యమమోటో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. నాలుగు సెట్ల పోరులో గోవా గార్డియన్స్‌పై మెరుపు విజయం సాధించిన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఆటగాళ్లను ఆ జట్టు యజమాని కంకణాల అభిషేక్‌ రెడ్డి అభినందించారు. బ్లాక్‌హాక్స్‌ ఆటగాళ్లలో శిఖర్‌ సింగ్‌, సాహిల్‌ కుమార్‌, యమమోటోలు రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -