Saturday, January 24, 2026
E-PAPER
Homeబీజినెస్రాష్ట్ర ప్రభుత్వంతో బ్లైజ్‌ ఒప్పందం

రాష్ట్ర ప్రభుత్వంతో బ్లైజ్‌ ఒప్పందం

- Advertisement -

దావోస్‌: కృత్రిమ మేధస్సు (ఎఐ) రంగంలో తెలంగాణను ప్రపంచ కేంద్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దావోస్‌లో రుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో బ్లైజ్‌ సంస్థ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుతో పాటు, రాష్ట్రంలో అధునాతన ఎఐ ఆర్‌అండ్‌డి కేంద్రాన్ని బ్లైజ్‌ స్థాపించనుంది. ఈ సందర్భంగా ఐటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్‌ మాట్లాడుతూ.. పరిపాలన, ప్రజా సేవలను మెరుగుపరచడానికి ఎఐని బాధ్యతాయుతంగా వినియోగి స్తామన్నారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీ యమని, తమ కంప్యూటింగ్‌ సామర్థ్యంతో దీనికి పూర్తి మద్దతు ఇస్తామని బ్లైజ్‌ సిఇఒ దినకర్‌ మునగాల తెలిపారు. ఈ ఒప్పందం వల్ల వినూత్న ఎఐ ఆలోచనలు పైలట్‌ ప్రాజెక్టులుగా మారి ప్రజలకు చేరువవుతాయని తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్‌ హబ్‌ సిఇఒ ఫణి నాగార్జున పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -