12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్ అన్నారు. పగిడిపల్లి, తాత నగర్ కు సంబంధించి ముఖ్యంగా మౌలిక వస్తువులకు కల్పించి అభివృద్ధి చేస్తా అన్నారు. ఎస్సీ, బీసీలకు సంబంధించి స్మశాన వాటికలలో మౌలిక వస్తువులు కల్పించి, ప్రహరి గోడ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పగిడిపల్లి గ్రామంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని నివారించేందుకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేయించి, వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా అన్నారు.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



