Thursday, May 1, 2025
Homeఎడిట్ పేజిధన్యజీవి

ధన్యజీవి

ఒకరో ఇద్దరో
వారసులుంటే అది
రక్తసంబంధం
లక్షలాదిమంది నీ
వారసులుంటే అది
కమ్యూనిస్టు సంబంధం!

పిల్లలు లేరని మీకు
ఎవరంటారు చెప్పు!
మాచూపుల్లో మీ రూపం
చూడకుండా ఉంటారా!
అందరూ నా వాళ్లేనని
అనుకున్నారు మీరు
అందుకే మీ ఆశయానికి
వారసులయ్యాం మేము

ఈ తెలుగునేల నిన్నుకనీ
ధన్యభూమిగా మారింది
నీ చరితను భరతజాతి
నింపుకుని మెరిసింది!

త్యాగాలను తనువంతా
కప్పుకుని బతికినోళ్లు
నీలాంటి నిప్పులాంటి
నేతలు మాకున్నందుకు
గర్వంగా, ధైర్యంగా
మున్ముందుకు పోతున్నం

సుందరయ్యా! మా సుందరయ్యా!
మా అందరి అడుగుజాడ నీవయ్యా!

  • కె.ఆనందాచారి
    (నేడు సుందరయ్య జయంతి)
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img