Wednesday, January 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిరక్త సంగమం

రక్త సంగమం

- Advertisement -

మా ఆశల హరివిల్లు
రంగుల్ని దొంగిలిద్దామనే
దురాశ
మా దేశంలో మేము
జీవశ్చవాలమనే
బ్రాంతి
మా ఎరుపురంగు
దొంగిలించడం
ఆ యుద్ధ బందిపోట్లకు
ఎలా సాధ్యం?
మా రక్తమే కాదు
మా నీరు గాలి
నింగీ నేల శ్వాసా ధ్యాస
మా చిన్ని కన్నుల్లో ఆకలి
మా బోసినవ్వుల్లో సహనం
అంతా అరుణారుణ వర్ణమే
మా రంగుతో
సంగమించడానికి
ప్రపంచమిపుడు
మా ముంగిట వాలుతుంది
మా బతుకులు మళ్లీ మళ్లీ
పచ్చగా చిగురించాలని
మా పాదాలను ఆరుధిరం
వెచ్చగముద్దాడుతుంది
అదేగా అంబరాన్ని తాకే
విశ్వమానవ శాంతిపతాక
ప్ర తి నెత్తుటి చుక్క
మారణాయుధాలకెప్పుడూ
మరణశాసనమే
రక్తరంజిత సంఘీభావమే!
కె. శాంతారావు,
9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -