Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రక్త దానం.. మహా దానం

రక్త దానం.. మహా దానం

- Advertisement -

బ్రహ్మ కుమారీస్ శోభా నాగమణి
నవతెలంగాణ – వనపర్తి 

అన్ని దానాల కన్నా రక్తదానం మహా గొప్పదని బ్రహ్మ కుమారిస్ శోభ నాగమణి అన్నారు. ఆదివారం బ్రహ్మ కుమారి రాజ యోగ సేవా కేంద్రం వనపర్తి శాఖ ఆధ్వర్యంలో విశ్వ బంధుత్వ దినోత్సవం, రాజ యోగిని ప్రకాశమని దాది గారి 18వ స్మృతి దినాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా రక్త దాన శిబిరం నిర్వహించగా వనపర్తి కేంద్రం లో మంది దాతలు రక్త దానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అధర్మం ఎక్కువ అయినప్పుడు ఒక మానవ రూపంలో భగవంతుడు ప్రవేశిస్తాడన్నారు. అతని ద్వారా జ్ఞాన రాజయోగ విధానాలను భోదింపడుతాయి. ప్రస్తుతం ప్రజలు భయబ్రాంతులతో జీవిస్తున్నారు ప్రకృతి ఆపదలు అదికమయ్యయి.

కుటుంబబందాల లో స్వార్థం పెరిగిపోయింది, మానవులలో కోరికలు అంతులేకుండా పోతున్నాయి, వికారి గుణాలు విజృంభింస్తున్నాయి. ఎటు చూసినా దుఃఖం – అశాంతి, నిరాశ – నిస్పృహ, భయం – ఆందోళనలు, రోగాలు – శోఖాలు అదికమయ్యయి. ఇది కలియుగ అంతానికి నిదర్శనమని, సరిగ్గా ఇటువంటి సమయంలోనే భగవంతుడు అవతరిస్తారని తెలిపారు. ఆయా కాలాల్లో క్రీస్తు, బుద్ధుడు గురునానక్, ప్రవక్త వంటి వారు దర్మ ప్రబోధకులుగా అవతరించారు అన్నారు. అనంతరం రక్త దానం చేసిన వారికి సర్టిఫికెట్ తో పాటు ప్రత్యేక కానుకలను అందజేశారు. ఈ శిబిరంలో సీనియర్ జర్నలిస్ట్ గంధం భక్త రాజు, రాజ యోగ కేంద్రం భక్తులు సతీష్, రాజు, వై.వెంకటేష్, కృష్ణ కుమార్, భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -