- Advertisement -
నవతెలంగాణ – పరకాల
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పరకాల పట్టణంలో నేడు (అక్టోబర్ 28వ తేదీన) రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించనున్నట్లు సిఐ క్రాంతి కుమార్ తెలిపారు. పట్టణంలోని డీపీఆర్ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మెగా రక్తదాన శిబిరానికి పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు, సామాజిక సేవకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని సిఐ పిలుపునిచ్చారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రజలు భాగస్వామ్యం కావాలంటూ సిఐ కోరారు.
- Advertisement -



