నవతెలంగాణ – ఆర్మూర్
ప్రముఖ రైతు నాయకుడు గల్ఫ్ కార్మిక నేత పట్టణ వాసి కోటపాటి నరసింహం నాయుడు 66వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పట్టణంలోని వంశీ గ్యాస్ ఏజెన్సీస్ ప్రాంగణంలో జరిగిన కోటపాటి జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొని మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కోటపాటి తన ప్రతి పుట్టినరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు గానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రాంతంలోని యువకులను సమీకరించి పెద్ద ఎత్తున ఇండియన్ రెడ్ క్రాస్సొసైటీ కి అందజేశారు.
ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ మాట్లాడుతూ.. సామాజిక సేవలలో భాగంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువకులను ఉత్తేజ పరచడం రైతులు గల్ఫ్ కార్మికులు కోసం పాటుపడుతూ మాలాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు .వారు ఆయు:రారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూకోటపాటికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శులు సంగం అనిల్ కుమార్ ,పోల్కం వేణు , పట్టణ అధ్యక్షులు ,మందుల బాలు కార్య నిర్వహకులు న్యాయవాది ఊరే బాలయ్య , రమేష్, సునీల్ పిప్పిరి ,కొక్కుల విద్యాసాగర్ ,చేపూర్ రుక్మాజి ,నరేష్ వర్మ ,గడ్డం ఉదయ్ కుమార్ ,నక్కల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోటపాటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరము
- Advertisement -
- Advertisement -