Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
ఈనెల 12న స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని శనివారం మండలకేంద్రములో రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ డెంటల్, ట్రాన్స్పోట్ అధికారులు సంయుక్త రక్త దాన, డెంటల్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వైద్యులు దంత పరీక్షలతో పాటు రక్త సేకరణ నిర్వహించారు. పోలీసులు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహణ నిర్వహించగా, ప్రముఖులు, వక్తలు స్వామి వివేకానంద స్పూర్తినీ వివరించారు. కార్యక్రమములో బ్లడ్ బ్యాంకు తెలంగాణ ఫౌండేషన్ గంగాధర్, తెలంగాణ డెంటల్ వైద్యులు జమాల్ పూరి రాజశేఖర్,ట్రాన్స్పోర్ట్ విభాగం అసిస్టెంట్ మోటార్ వెకిల్ ఇనిస్పెక్టర్ పవన్ కళ్యాణ్, వాసుకి మేడం, మాజీ సర్పంచ్ కర్కా గంగారెడ్డి, జిర్రా మహిపాల్, సీనియర్ జర్నలిస్టులు మంచికంటి నరందర్, సాయికుమార్, మోహన్, మురళి, పాల్థి గంగదాస్, చిలుక మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -