Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాదు రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. క్లబ్ ప్రతినిధులు 17 మంది ఈ సందర్భంగా రక్తదానం చేశారు. క్లబ్ అధ్యక్షుడు పద్మ శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానమని అన్నారు.ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. తమ క్లబ్ సభ్యుడు కోటగిరి చంద్రశేఖర్ వంద సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, ఆర్. గౌరీ శంకర్, సూర్యప్రకాష్, బి. వీరబ్రహ్మం, జి.రమేష్, డాక్టర్ వినోద్ పవార్, చంద్రశేఖర్, శ్రీనివాస్, రాజశేఖర్, నేతి శేఖర్, రాంప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -