– రక్తదానం ప్రాణాధారం: ఏడీ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణాధారం అని,రక్తదానం చేయడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాల హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరం లో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని,యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
అనంతరం కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది కళాశాల చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల హెల్త్ క్లినిక్ ఇంచార్జ్ డాక్టర్ కె.శిరీష, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ రుక్మిని, డాక్టర్ మౌనిక నిర్వహించారు. ఇందులో కళాశాల బోధ న సిబ్బంది డాక్టర్ నీలిమ, డాక్టర్ దీపక్ రెడ్డి,బోదనేతర సిబ్బంది రవీంద్ర రెడ్డి,నర్స్ సుశీల, భద్రాచలం మదర్ బ్లడ్ బాంక్ టెక్నీషియన్ శ్రీనివాస,హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ కె. వర్ధిని, స్టాఫ్ నర్స్ మంగ పాల్గొన్నారు.



