Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాలు

- Advertisement -

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ తరఫున నిర్వహించిన రక్తదాన శిబిరాలకు మంచి స్పందన లభించింది. నగరంలోని పేట్లాబురుజులో గల సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒకపక్క శాంతి భద్రతల పరిరక్షణ వంటి కీలకమైన విధులను నిర్వహిస్తూ, మరోపక్క మనుషులను ఆదుకొనే రక్తదానాన్ని పోలీసులు పెద్ద ఎత్తున నిర్వహించడం వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన పోలీసులతో పాటు సాధారణ పౌరులకు ఆయన పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి సజ్జనార్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ విధంగానే రాష్ట్రంలోని ఇతర పోలీస్‌ కమిషనరేట్లు, జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్లలో సైతం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు మంచి స్పందన లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -