Sunday, October 26, 2025
E-PAPER
Homeజిల్లాలురక్తదానం మహోన్నతమైనది

రక్తదానం మహోన్నతమైనది

- Advertisement -

ఒకప్పటి పోలీసు ప్రాణ త్యాగాల ఫలితమే
ప్రస్తుత ప్రశాంత జిల్లాకు కారణం
అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేది రక్తం
స్వచ్ఛందంగా 252 మంది రక్తదానం
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ 
ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ
నవతెలంగాణ – వనపర్తి 

జీవితంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం మహోన్నతమైనదని, రక్తాన్ని దానధనం చేయడం ద్వారా మరొకరి ప్రాణాన్ని నిలపగలిగే శక్తి ఉందని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రావుల గిరిధర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ రక్తదాన శిబిరంలో జిల్లాలోని పోలీసు అధికారులు వనపర్తి సీఐ కృష్ణయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పల నాయుడు, పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి, వనపర్తి పట్టణ ఎస్సై హరిప్రసాద్, వనపర్తి రూరల్ 2వ ఎస్సై వేణుగోపాల్, చిన్నంబావి ఎస్సై జగన్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు వినోద్, ముగ్దమ్, పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు, వివిధ విద్యార్థి సంఘాల  నాయకులు 252 మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ పోలీసు అమరవీరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. వారి త్యాగ ఫలితమే మనమంతా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నామని అన్నారు. పేదప్రజలు, బాధితులకు సత్వర న్యాయం అందించడం,ధర్మం పక్షాన నిలిచి మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే వారి త్యాగానికి మనమందించే ఘనమైన నివాళి అని తెలిపారు. అమ్మ జన్మనిస్తే రక్తదానం పునర్జన్మ నిస్తుందని అన్నారు. ఒక్క రక్తదానంతోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం సాధ్యమవుతుందన్నారు. 

థలసేమియా,క్యాన్సర్, హిమోఫీలియా,రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి,ఇతరత్రా జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, రక్తదానం చేసి అటువంటి వారి ప్రాణాలను కాపాడటం ద్వారా మనకు కూడా మంచి చేకూరుతుందని అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దని ఎస్పీ అన్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడానికి ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్తం ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి ప్రతీ 5 నెలలకొకసారి రక్తదానం చేయడం ద్వారా శరీరం మరింత ఉత్సాహవంతంగా మారుతుందని అన్నారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రక్తదానం చేసిన రక్త దాతలకు ఎస్పీ ప్రశంషా పత్రం, పండ్లు పంపిణీ చేశారు.

ఈ రక్తదాన శిబిరం ద్వారా 252 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని, సేకరించి రక్తాన్ని నిస్వార్థ ఆర్గనైజేషన్, డబ్ల్యూ ఎస్ ఓ హైదరాబాద్ సహకారంతో ఇండియన్ ప్రీవేంట్యూ మెడిసిన్( ఐపీఎం ) నారాయణ గూడ హైదరాబాద్ బ్లడ్ బ్యాంకుకు అందజేస్తున్నామని తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన అధికారులకు, సిబ్బందికి, యువకులకు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులకు, విద్యార్థినీ విద్యార్థులకు, ప్రజా సంఘాల నాయకులకు వనపర్తి జిల్లా, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎస్పీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డిసిఅర్భి డిఎస్పీ ఉమామహేశ్వరరావు, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సిఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, అప్పలనాయుడు, శ్రీనివాస్, నిస్వార్ధ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు అరవింద్, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది, విద్యార్థులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -